ఓటు వేయండి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చండి

ఓటు వేయండి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చండి
ఓటు హక్కును వినియోగించుకున్న (బిత్తిరి సత్తి)
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కావలి రవికుమార్ (బిత్తిరి సత్తి) తమ స్వగ్రామమైన చేవెళ్ళ మండలం పామేన గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, ఓటుతో మార్పు తేవచ్చని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పామేనా గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన ఆనంతరం మాట్లాడారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు. ముఖ్యంగా యువతీ యువకులు ఓటు వేయడానికి ఆసక్తి కనపరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.