ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం
–డి.ఎస్.పి మండల నాయకులు నెరేళ్ల రమేష్.
జ్ఞానంతెలంగాణ చిట్యాల మే 11:
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ ను గెలిపించుకుందామని ఆ పార్టీ మండల నాయకులు నెరేళ్ల రమేశ్ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను కోరారు.శనివారం చిట్యాల మండలం లోని పలు గ్రామాల్లో గడప గడప కు ప్రచారం చేస్తూ, ధర్మసమాజ్ పార్టీ సీరియల్ నెంబర్ 14,చెప్పుల గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వ్యతిరేకమని, భారత రాజ్యాంగాన్ని తీసేయలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగ రక్షణ పార్టీగా ధర్మసమాజ్ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు.డా. విశారదన్ మహరాజ్ నాయకత్వంలో సబ్బండ కులాలకు(BC, SC, ST& DFC) సమాన వాటా వస్తుందని, భారతదేశానికి మహనీయులు కలలుగన్న రాజ్యాన్ని స్థాపించడమే ఆయన లక్ష్యమని అన్నారు. చెప్పుల గుర్తుకు ఓటు వేసి ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పుల్ల అశోక్, మట్టేవాడ కుమార్, నద్దునూరి రాజకుమార్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.