సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు గోడం నాగేష్ గారిని ఆశీర్వదిస్తే

సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు గోడం నాగేష్ గారిని ఆశీర్వదిస్తే రోజుకు కోటి రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో రూ.1825 కోట్ల నిధులు కేంద్రం నుండి తీసుకొస్తాం – సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు**కాగజ్ నగర్ :* పట్టణంలోని ఎస్పియం క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. *ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ తనను ఆశీర్వదించినట్టే గోడం నాగేష్ గారిని కూడా ఆశీర్వదించాలని, రోజుకు కోటి రూపాయల చొప్పున 5 సం.లకు రూ.1825 కోట్ల నిధులు తీసుకువస్తామని తెలియజేశారు. సిర్పూర్ నియోజకవర్గం 119 నియోజకవర్గాలోనే వెనుకబడిందని , అందుకని వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మోదీజీ ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్తె అవతారం ఎత్తిందని, కాబట్టి దాన్నుంచి ఏం ఆశించలేమని తెలిపారు.**కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి మోదీజీని ప్రధానిగా చేయాలని బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలకు పిలుపునిచ్చారు.*

You may also like...

Translate »