త్రాగునీరు లీకేజ్ పైప్ లైన్ కు మరమ్మత్తులు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి బాలాజీ

వృధాగా పోతున్న నీరు..పట్టించుకోని అధికారులు. వార్తకు స్పందన

జ్ఞాన తెలంగాణ మే 6 తిరుమలాయపాలెం/ఖమ్మం జిల్లా బ్యూరో:వృధాగా పోతున్న నీరు..పట్టించుకోని అధికారులు, వచ్చిన వార్తకు స్పందించి శుక్రవారం పంచాయతీ కార్యదర్శి బానోత్ బాలాజీ నాయక్ తమ సిబ్బందితో మరమ్మతులు చేపట్టారు. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో జాతీయ రహదారి పక్కన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం దగ్గర ఉన్న త్రాగునీరు పైప్ లైన్ లీకేజీ కాగా దీంతో పిండిప్రోలు గ్రామపంచాయతీ కార్యదర్శి బానోత్ బాలాజీ నాయక్ తన సిబ్బందితో త్రాగునీరు వృధాగా పోకుండా పైపులైన్ లకు మరమ్మత్తులు చేసి నట్లు ఆయన తెలిపారు.

You may also like...

Translate »