మే 5 న మార్క్స్ 206 వ జయంతి .మార్క్స్ సమాధి వద్ద ఎంగెల్స్ చేసిన ప్రసంగంలో కొన్ని విషయాలు:

డార్విన్ ఏ విధంగానైతే జీవ ప్రకృతి యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడో సరిగ్గా అదే విధంగా మార్క్స్ మానవ చరిత్ర యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడు. మార్క్స్ కనిపెట్టిన సమగ్రమైన శాస్త్రీయమైన చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం అంతవరకు చరిత్ర గురించి ఉనికిలో ఉన్న అన్ని రకాల తప్పుడు సిద్ధాంతాలను చావు దెబ్బ కొట్టింది.కారల్ మార్క్స్ ఒక గొప్ప మానవ విజ్ఞాన శాస్త్రవేత్త .అన్నింటికంటే ముఖ్యంగా ఆయన గొప్పశ్రామిక విప్లవవాది.ఆయన మానవ సమాజ విముక్తి పథ నిర్దేశకుడు. 19వ శతాబ్దం మానవ సమాజానికి సమర్పించిన ఒక మహోన్నత మానవుడు. పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చివేయడానికి ఆధునిక శ్రామిక వర్గ విముక్తికి తోడ్పడడమే ఆయన జీవిత పరమోద్దేశం. ఆయన పేరు యుగయుగాల దాకా అమరంగా ఉంటుంది .అలాగే ఆ కృషి కూడా చిరస్థాయిగా ఉంటుంది అదనపు విలువ ఆవిష్కారంతో సమకాలిన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని శాసించే ప్రత్యేక గతి నియమాన్ని మార్క్స్ కనుగొనడంలో చరిత్రలో మొదటి సారిగా వెలుగు ప్రసరించబడింది.కామ్రేడ్ మార్క్స్ పరిశోధన జరిపిన ప్రతి రంగంలోనూ ,తాత్విక ,చారిత్రక, ఆర్థిక ,సామాజిక వర్గ పోరాట రంగాల్లోని ప్రతి ఒక్క విషయంపై కూడా ఆయన స్వతంత్రమైన లోతైన ఆవిష్కరణ చేశాడు .కారల్ మార్క్స్ కు విప్లవ జోహార్లు.

You may also like...

Translate »