భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 05 కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీల నాయకులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గుండాల సహకార సంఘం చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇంచార్జి పామేన భీం భరత్ సమక్షంలో ఆదివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుండాల మాజీ పిఎసీఎస్ చైర్మన్ పోలీస్ దయాకర్ రెడ్డి, గంగిడి శ్రీనివాస్ రెడ్డి మరియు 100 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రంజిత్ రెడ్డి గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గుండాల గ్రామ నాయకులు పాల్గొన్నారు.*