రఘురామ కృష్ణం రాజుకు మరో షాక్..గెలుపు ఆశలపై నీళ్లు..?

వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి వార్తల్లో నిలిచారు. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. నియోజకవర్గానికి దూరంగా ఉన్న రఘురామ ..ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీటు ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఒకనొక సమయంలో రఘురామ కృష్ణం రాజుకు కూటమి తరుఫున టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. చివరికి ఆయన టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి మరీ రఘురామ కృష్ణం రాజుకు చంద్రబాబు టికెట్ కేటాయించారు.ఉండి ఎమ్మెల్యే రామరాజు సైలెంట్ అయినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. టీడీపీ తరుఫున టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్లు విత్ డ్రా గడువు కూడా ముగియడంతో శివరామరాజు బరిలో నిలిచారు. అయితే శివరామరాజును రఘురామ కృష్ణం రాజు బెదిరించారనే వార్తలు వస్తున్నాయి.

శివరామరాజుకు ఫోన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వెనక్కి తీసుకోమని రఘురామ కృష్ణం బెదిరించారని తెలుస్తోంది.నీకు ఎన్ని ఓట్లు ఉంటాయి మహా అంటే రెండు మూడు వేలు అంతేగా , నీ దగ్గర డబ్బు లేదంటూ శివరామరాజును ఉద్దేశించి రఘురామ కృష్ణం రాజు చులకనగా చేసి మాట్లాడి అవమానించారు. దానితో ఆత్మాభిమానం దెబ్బ తిన్న శివరామరాజు పోటీలో ఉండటానికి నిశ్చయించుకొని తనని అవమానించిన రఘు రామ కృష్ణంరాజును ఓడించి తీరుతా అని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ రఘు రామ కృష్ణంరాజు గెలుపవకాశాలపై శివరామరాజు ఏ మేరకు దెబ్బ కొడతారో చూడాల్సి ఉంది.

You may also like...

Translate »