వైరాలో ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు.

  • ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చే జెండా ఆవిష్కరణ.

జ్ఞాన తెలంగాణ మే1,వైరా/ఖమ్మం జిల్లా ప్రతినిధి: మే డే వేడుకలను పురస్కరించుకొని వైరా మున్సిపాలిటీ నాలుగో వార్డ్ మాటూరు పేట నందు ఐ.ఎన్.టి.యు.సి జిల్లా కార్యదర్శి పాణ్యం భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఐ.ఎన్.టి.యు.సి జెండాను ఆవిష్కరించారు అనంతరం రాందాస్ నాయక్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకార్మిక విభాగమైన ఐఎన్టియుసి కీలక పాత్ర వహిస్తుందని, ఎంతోమంది కార్మిక నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ ఐఎన్టియుసి ద్వారా ప్రజా ప్రతినిధిలుగా తీర్చిదిద్దిందని, వైరా నియోజకవర్గంలో కార్మికులకు, ఐఎన్టియుసి నాయకులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుంటానని రాందాస్ నాయక్ హామీ ఇవ్వడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామ రెడ్డికి కార్మికులు అత్యధిక స్థాయిలో ఓట్లు వేసి గెలిపించాలని రామదాస్ నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, కట్ల రంగారావు, రాష్ట్ర మాజీ మార్కుపై చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల సంతోష్, నండ్రు నాగరాజు,చప్పిడి వెంకటేశ్వర్లు, ఐఎన్టియుసి జిల్లా కార్యదర్శి పాలెం.భాస్కర్, ఐఎన్టియుసి నాయకులు ఎస్కే మస్తాన్, అంబటిపూడి శ్రీను, పానం బాలరాజు, గుత్తికొండ నవీన్,రాధాకృష్ణ,రామకృష్ణ,యాకోబు,ఎస్కే మీరా,నాగరాజు,వెంకన్న,వెంకటేశ్వర్లు,నరేష్,అజీమ్,కిరణ్,తలారి మోహన్రావు,చిన్న అబ్రహం,అంబర్లపూడి నవీన్,రేగళ్ల మురళి,యామల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »