ఉద్యమ నేతను చూసి.. ఉప్పొంగిన ఉత్సాహం

ఉద్యమ నేతను చూసి.. ఉప్పొంగిన ఉత్సాహం గుబులుగా ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన కె.సి.ఆర్జ నసంద్రంమైన ఖమ్మం, పదును తగ్గని పలుకుతో అధికార పక్షానికి వణుకు పుట్టించిన కె.సి.ఆర్* జ్ఞాన తెలంగాణ ఏప్రిల్ 29, ఖమ్మం జిల్లా ప్రతినిధి: బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది.

ఈ రోడ్ షో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ దళం లో జోష్ నింపింది. జనసంద్రమైన రోడ్ షో లో మాజీ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ మాట్లాడుతూ.. బి.ఆర్.ఎస్. ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో రైతులకు నిరంతరం కరెంటు కల్పించామని, తొమ్మిది సంవత్సరాలు పోకుండా ఉన్న కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కల్లబొల్లి మాటలతో గారడి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పిండు మరి చేసిండా..? రైతు బంధు కు బంధు పెట్టి రైతులను అరిగోస పెడుతుండు. ఆనాడు నాగార్జున సాగర్ లో 95 అడుగులున్నా నేను నీళ్లిచ్చినా..మరి ఈనాడు సాగర్ లో 510 అడుగులున్నా..నీళ్లివ్వలేదు.నేలకొండపల్లి లో పచ్చని పొలాలు ఎండిపోతుంటే జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా నీళ్లివ్వలేక పోయారు. ఆనాడు నేను స్వరాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు నన్ను ఖమ్మం తీసుకువస్తే..న్యూడెమోక్రసీ, విద్యార్థి సంఘాలు నాకు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి రాష్ట్రములో కాంగ్రెస్ ను ఎదిరించి ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పాలన వచ్చిందని, తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంతకు మించిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని అన్నారు.

సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే.. నన్ను జైల్లో వేస్తాడట,కళ్ళు గుడ్లు పీకుతాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరిస్తే బెదురుతాడా ఈ కె.సి.ఆర్. బి.ఆర్ ఎస్ హాయంలో ఉమ్మడి జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు, పాలేరు నియోజక వర్గంలో జె.ఎన్. టి.యూ,నర్సింగ్ కాలేజీని,ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మరోసారి. మోసపోవద్దని ప్రతిరోజు మీ జిల్లా కోసం పరితపించే నామ నాగేశ్వరరావు కు ఓటు వేయాలని,నామ మరింత పెద్ద స్థాయికి వెళ్లి రాష్ట్రాన్నీ,జిల్లాని మరింత అభివృద్ధి కొరకు పోరాడే నామాను కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక.మెజారిటీ తో గెలిపించాలన్నారు.

You may also like...

Translate »