నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2025 విడుదల..

న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025 వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఇందులో అఖిల భారత సర్వీసు పరీక్షలతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను కూడా యూపీఎస్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్ లో వచ్చే ఏడాది జరిగే సివిల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఎస్‌, ఎన్ డీఏ లతోపాటు పలు పరీకలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.

యూపీఎస్సీ 2025 నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్‌ (ప్రిలిమ్స్‌) 2025 నోటిఫికేషన్‌ జనవరి 22, 2025వ తేదీన విడుదలవుతుంది. ఫిబ్రవరి 11, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 25న రాత పరీక్ష జరుగుతుంది.

యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ, సీడీఎస్‌ ఎగ్జామ్‌ (1) 2025 నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 11, 2024 విడుదలవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 31 చివరితేదీ. ఏప్రిల్ 13, 2025న రాత పరీక్ష జరుగుతుంది.

యూపీఎస్సీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ప్రిలిమ్స్‌) ఎగ్జామ్‌ 2025 నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 18,2024 విడుదల అవుతుంది. అక్టోబర్‌ 8, 2024 దరఖాస్తులు ముగుస్తాయి. రాత పరీక్ష ఫిబ్రవరి 09, 2025న జరుగుతుంది.

యూపీఎస్సీ కంబైన్డ్‌ జియో-సైంటిస్ట్‌ (ప్రిలిమ్స్‌) 2025 నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 4, 2024న విడుదలవుతుంది. సెప్టెంబర్‌ 24, 2024 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 09, 2025న రాత పరీక్ష జరుగుతుంది.

యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ (ఈఎక్స్‌ఈ) ఎల్‌డీసీఈ 2025 నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 4, 2024న విడుదలవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 24, 2024 వరకు కొనసాగుతుంది. రాత పరీక్ష మార్చి 09, 2025 జరుగుతుంది.

యూపీఎస్సీ ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ ఎగ్జామ్‌ 2025 నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 12, 2025న విడుదలవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 04,2025తో ముగుస్తుంది. జూన్‌ 20, 2025 రాత పరీక్ష జరుగుతుంది.

యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2025 నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 19, 2025న విడుదలవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 11, 2025తో ముగుస్తుంది. జులై 20, 2025 రాత పరీక్ష ఉంటుంది.

యూపీఎస్సీ సీఏపీఎఫ్‌(ఏసీ) ఎగ్జామ్‌ 2025 నోటిఫికేషన్‌ మార్చి 05, 2025న విడుదల అవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 25, 2025తో ముగుస్తుంది. ఆగస్టు 03, 2025 రాత పరీక్ష ఉంటుంది.

యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ, సీడీఎస్‌ ఎగ్జామ్‌ (2)2025 నోటిఫికేషన్‌ మే 28,2025న విడుదల అవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 17, 2025తో ముగుస్తుంది. రాత పరీక్ష సెప్టెంబర్ 14, 2025 ఉంటుంది.
యూపీఎస్సీ ఎస్‌వో/ స్టెనో(జీడీ-బి/జీడీ-1) ఎల్‌డీసీఈ 2025 నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 17, 2025న విడుదల అవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్‌ 07, 2025తో ముగుస్తుంది. డిసెంబర్‌ 13, 2025 రాత పరీక్ష ఉంటుంది.

You may also like...

Translate »