మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా అందరి అంజయ్య నామినేషన్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన న్యాయవాది అందరి అంజయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు శుక్రవారం మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించి డబ్బు ప్రవాహంతో ప్రజలను మభ్యపెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదని అందుకే స్వతంత్ర అభ్యర్థిగా తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు నిత్య సేవకుడిగా ఉంటానని అందరి అంజయ్య తెలిపారు. ఎన్నికలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ పార్టీలకు దీటుగా ఎలాంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా ధర్మబద్ధంగా ఈ ఎన్నికల్లో నిలబడతానని అంజయ్య తెలిపారు.. కేపి

You may also like...

Translate »