సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు మడికొండలో జరగనున్న సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య కు మద్దతుగా మడికొండలో నిర్వహిస్తున్న ప్రజా గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు..
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు..
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ భారీ తో కలిసి హెలిపాడ్ సెంటర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు..
సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు…