ఈ నెల 24న సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి
ఈ నెల 24న సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే నాయిని
జ్ఞాన తెలంగాణ, హనుమకొండ:

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 24న మడికొండలో సెయింట్ పాల్స్ మైదానంలో జరిగే జన జాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులు ప్రతి డివిజన్ నుండి వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముఖ్యమంత్రి సభలో పాల్గొనేలా చేయాలన్నారు. బీజేపీ లాంటి పార్టీ నుండి దేశాన్ని, భారతదేశ ప్రజలను కాపాడుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? అన్ని కులాలు మతాలతో కూడుకున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దళితులకు బీజేపీ చేసింది ఏమీ లేదని అన్నారు. గత గత పది సంవత్సరాల పరిపాలనలో బీజేపీ ఏ ఒక్కరికి సొంత ఇల్లు కట్టించలేదని అన్నారు. అదే గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, నిరుపేదలైన వారికి భూమి ఇచ్చారు. బీజేపీ మాత్రం గత పదేళ్లలో ఆదాని అంబానీ ఆస్తులు పెరిగాయి తప్ప పేదలకు మాత్రం చేసింది
ఏమీ లేదు అన్నారు. ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యం అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దళిత బహుజనలకు ఉన్న రిజర్వేషన్ కూడా ఎత్తివేస్తారని తెలిపారు. అందుకే యువనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇష్టపడి పని చేయాలన్నారు.
ఈనెల 24న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు కుచన రవళి, సీనియర్ నాయకులు బుద్ధి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ అజిజి ఖాన్, మరియు కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు జక్కుల రమ రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, సీనియర్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి,కట్ట రఘుపాల్ రెడ్డి, మల్లారెడ్డి, ఎస్ కే సయ్యద్, బందల జితేందర్,తదితరులు పాల్గొన్నారు.