కొండాకు అండగా మహేశ్వరం ఉండాలి
కొండాకు అండగా మహేశ్వరం ఉండాలి
శ్రీ రాజరాజేశ్వరాలయంలో శివయ్యకు పూజలు
ప్రధాని మోదీజీతోనే దేశ భద్రత ప్రగతి
1వ బూత్ లో ఇంటి ఇంటి ప్రచారంలో
అందెల శ్రీరాములు యాదవ్
జ్ఞాన తెలంగాణ (మహేశ్వరం)

వచ్చే ఎంపీ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. మహేశ్వరం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తొలుత ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం కోసం శ్రీ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం, స్థానిక ఎంపీటీసీలు పోతర్ల సుదర్శన్ యాదవ్, శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ… బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బుడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే దేశం మరో దశాబ్దం దేశాభివృద్ధి వెనక్కి పోతుందన్నారు.అఖండ భారత్ సమగ్ర అభివృద్ధి, భద్రతకు ప్రధాని నరేంద్రమోడీజీని మరోసారి ఆశీర్వాదించాలని ఓటర్లను కోరారు.
దేశ భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకి పరమేశ్ ముదిరాజ్, చింటు పోతురాజు, పంతులాల్ సంతు నాయక్, బూత్ అధ్యక్షులు అనప నరేష్, మోతే యాదయ్య మరియు చందు, నగేష్, కానాపురం రవి, కాకి గిరి, చిప్పిచెట్టి రాఘవేందర్, మోతా మల్లేష్, అత్తిలి నరసింహ, సత్యప్రసాద్, నమో శ్రీశైలం యాదవ్, సందుల గణేష్ సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.