ఫ్రీడమ్ పార్కులో నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలి
ఫ్రీడమ్ పార్కులో నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలి
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం:

గట్టయ్య సెంటర్ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలో గల ఫ్రీడం పార్కులో నెల రోజులుగా వాకింగ్ టాక్ పై ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించకపోవడం వల్ల వాకర్స్ అసౌకర్యానికి గురవుతున్నారని తక్షణమే వాటిని తొలగించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల అశోక్ కోరారు.
ఆదివారం మాస్ లైన్ ప్రతినిధి బృందం ఫ్రీడం పార్కును సందర్శించి అడ్డంగా ఉన్న నిర్మాణ వ్యర్ధాలను పరిశీలించారు. పార్కు పక్కనే గల బిల్డింగ్ మూత్రశాల నిర్మాణం కోసం నెల రోజుల క్రితం సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కొరకు తోడిన మట్టి రాళ్ళను పార్కులో కుప్పగా పోసారని వర్క్ పూర్తయినప్పటికీ దారికి అడ్డంగా ఉన్న రాళ్లు రప్పలు మట్టిని కాంట్రాక్టు తొలగించకపోవడం సరికాదని ఆయన అన్నారు.
తక్షణమే అధికారులు కలగజేసుకొని ఫ్రీడమ్ పార్కులో వాకర్ క్రీడాకారులకు అసౌకర్యం కలిగిస్తున్న వ్యర్ధాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు, కే శ్రీను, ఆజాద్, శోభ, భరత్, రాకేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.