ప్రతి కూలీకి రెండు వందల పని దినాలు కల్పించాలి

ప్రతి కూలీకి రెండు వందల పని దినాలు కల్పించాలి


జ్ఞాన తెలంగాణ ,నారాయణపేట:


పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల డబ్బులను వెంటనే చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పని చేసిన కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ప్రతి కూలీకి 200 దినాల పని కల్పించాలని, రోజు కూలీ 600 ఇవ్వాలని కోరారు. పని ప్రాంతాల్లో త్రాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

You may also like...

Translate »