గెలిపించండి అభివృద్ధి చేసి చూపుతా
గెలిపించండి అభివృద్ధి చేసి చూపుతా
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట :

నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధన్వాడ, మరికల్ మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ చల్ల వంశీచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు యువకులు ,నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి గెలిపించాలని కోరారు.
మీ కష్టాల కౌగిలిలో ముందుండి నడుస్తానని మాటిస్తున్నాను.ప్రజల పక్షాన , నిలబడి, నిరంతరం శ్రమించి పనిచేస్తానని మాట్లాడారు. డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల, ఇతర గ్రామాల వారు,పాల్గొన్నారు.