వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
జీవో నెంబర్ 1కి విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్
అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై దురుసుగా వ్యవహరించిన యాజమాన్యం
యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 15
జీవో 1 నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వం విద్యాశాఖ ఉత్తర్వులను తుంగలోతొక్కి
ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాళ్ళు
స్కూలల్లో పుస్తకాలు అమ్ముతు
ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానందా ఇంటర్నేషనల్ స్కూల్ లో
జీవో 1 కు విరుద్దంగా పుస్తకాలు అమ్ముతు అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని
అన్నారు.ఈ విషయాన్నీ చేవెళ్ల
ఎం ఈ వో సయ్యద్ అక్బర్ కు
సమాచారమిచ్చిన చర్యలకు
పూనుకోలేదని, ఎంఈఓ అక్బర్ ప్రభుత్వ పాఠశాలల సమస్యలను గాలికి వదిలి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై య్యారని ఎస్ ఎఫ్ ఐ
చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ అన్నారు . శనివారం వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారని
తెలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్లి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు.పాఠశాల యాజ మాన్యం ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా కొనసాగించాడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నాయ కులు బుక్స్ తో పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తుంటే పాఠశాల యాజమాన్యం దురుసుగా వ్యవహరించ డంతోపాటు మీరు ఎవరికీ కంప్లీట్ చేసినా మేము బుక్స్ విక్రయిస్తామని కరాకండిగా యాజమాన్యం చెప్తున్నారని ఈ విషయాన్నీ స్థానిక ఎంఈఓ అక్బర్ కు చరవాణిలో సమాచారం ఇస్తే తాను మూడు గంటలకు వస్తానని పాఠశాల యాజమాన్యం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఈఓ మనం మాట్లాడదామని చెప్పడం విడ్డూరంగా ఉందనిఅన్నారు. దీనిని బట్టి ఇదంతా చేవెళ్ల ఎంఈఓ కనుసనల్లోనే నడుస్తుంది అన్నారు.ఎంఈఓ అక్బర్ ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ విద్యా వ్యాపారానికి కృషి చేస్తున్నారని మండిపడ్డారు . స్థానిక ఎంఈఓ అక్బర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బుక్స్ విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాని డిమాండ్
చేశారు.
ఎంఈఓ అక్బర్ ను వెంటనే బర్తరప్ చేయాలి
చేవెళ్ల శంకర్పల్లి మండల పరిధిలోని ప్రైవేట్ కార్పొరేట్ యజమానులకు తొత్తుగా మారిన ఎంఈఓ సయ్యద్ అక్బర్ పై కలెక్టర్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చేవెళ్ల డివిజన్ కమిటీ అధ్యక్షుడు బేకరీ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ, స్కూల్ ఆవరణలోనే దర్జాగా పుస్తకావ్యాపారం చేస్తు రకరకాల ఫీజుల పేరిట దోపిడికి పాల్పడుతున్న చూసి చూడనట్టుగా వ్యవహారిస్తున్న ఎంఈఓ అక్బర్ ను సస్పెండ్ చేయాలనీ అన్నారు.గతంలో జిల్లా ఉన్నతాధికారులు ఎంఈఓ విధినిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తూ మొట్టికాయలు వేసిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఇంతవరకు ఆయనపై గట్టి చర్యలు తీసుకోకపోవడంమే అయన వ్యవహారశైలికి కారణమని అన్నారు . మండల కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ కొనసాగిస్తున్నప్పటికీ రివ్యూ తుతూమంత్రంగా తనిఖీ నిర్వహించి
చేతులు దులుపుకున్నారని అన్నారు.వెంటనే ఎంఈఓ అక్బర్ ను బర్తరప్ చేయాలని
ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు బేగరి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో చేవెళ్ల నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.