ఊట్ పల్లి సబ్ సెంటర్లో టీ.బీ నివారణపై అవగాహన

ఊట్ పల్లి సబ్ సెంటర్లో టీ.బీ నివారణపై అవగాహన
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామంలో గురువారం హెల్త్ సబ్ సెంటర్ లో జిల్లా క్షయ నిర్దారణ వైద్య సిబ్బంది టీబీ నివారణపై రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగ టీబీ సూపర్ వైజర్ ఈశాన్ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య కార్యకర్తలచే క్షయ రోగులను గుర్తిస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో క్షయ, టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి నుంచి కఫం సేకరించి రోగనిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఊట్ పల్లి, పెగడాపల్లిలో 30 మంది నుంచి కఫం సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ప్రియాంక, టీబీ సూపర్ వైజర్ పద్మ, ఏఎన్ఎం సరస్వతి, ఆశ కార్యకర్తలు ఈరమణి, సావిత్రి, రాజేశ్వరి,సుజాత, అంగన్ వాడీ టీచర్ కమలు ,పంచాయతి కార్యదర్శి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.