ఇంటింటికి భగీరథ నీటి సర్వే

ఇంటింటికి భగీరథ నీటి సర్వే
జ్ఞాన తెలంగాణ – బోధన్
గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి నీటి కళాయిలను ఏర్పాటు చేసింది .ఆ ఫథకంలో భాగంగా మిషన్ భగీరథ నీరు కుళాయిల ద్వారా ఇంటింటికి అందుతుందా లేదా అంటు గురువారం సాలూర గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సిబ్బంది విజయ్ ఇంటింటికి తిరుగుతూ ఆధార్ కార్డులు సేకరిస్తు సర్వే నిర్వహించారు. నీటి కుళాయిలు ఏర్పాటుచేశారు కాని కనీసం చుక్క నీరు రావడం లేదని కాలనీవాసులు పంచాయతి కార్యదర్శికి నిలదీశారు. చుక్క తాగునీరు అందించని మిషన్ భగీరథ పథకం నల్లాలతో ఉపయోగం లేదని కాలనీవాసులు వాపోయారు.