విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు

జ్ఞాన తెలంగాణ కాట్రపల్లి,
జూన్ 12.

కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో డివిజనల్ ఇంజనీర్ పి.విజయ్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాట్రపల్లి గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్ గారు మొదటగా గ్రామ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. దానిలో భాగంగా మిడిల్ పోల్స్, లో వోల్టేజ్ సమస్యలు మరియు కరెంట్ బిల్లు గృహ జ్యోతి కి సంబంధించిన సమస్యలు విన్నారు, వాటిని రిజిస్టర్ చేయించి తక్షణమే ప్రమాద భరితంగా నాలుగు ప్రదేశాలలో మధ్య పోలులు వేయించినారు మరియు లో ఎత్తు తక్కువగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న ఎల్టీ ఫ్యూజ్ సెట్టు లను సరిచేయమని సిబ్బందికి ఆదేశించి, వాటిని వెంటనే చేయించారు.

ముఖ్యంగా అవగాహన సదస్సులో ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు, వాటి నివారణ కోసం పెద్దపీట వేయాలన్నారు. అందులో భాగంగా గృహ వినియోగదారులు నాణ్యమైన వైర్లు వాడాలని సూచించారు, ఎవరు కూడా కొక్కెలు తగిలించకూడదు అని సూచించారు, గృహ వినియోగదారులకు ఇంటి దగ్గర ఎర్థింగ్ చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ బావుల దగ్గర మోటార్లకు మరియు స్టార్టర్ కి స్టార్టర్ బాక్సులకు ఎర్తింగులు చేయాలని సూచించారు, రైతులు తనయొక్క మోటార్ కి తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించాలని సూచించారు. గృహావినియోగదరులు సర్వీస్ వైర్లను ఇనుప రేకుల పై, ఇనుప పైపులపై తీసుకువెళ్ళ వద్దని, వాటికి పివిసి పైపులు వేసుకోవాలని సూచించారు దొంగతనంగా కరెంటు వాడడం చట్టరీత్యా నేరం అని తెలిపారు. కావున ప్రతిఒక్కరూ మీటర్ ద్వారా మీటర్ ద్వారా కరెంటు వాడాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న గృహ జ్యోతి పథకంలో అందరూ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ నీ ,తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ బావులకి డీడీలు లేని వారు అందరూ కొత్తగా డీడీలు కట్టి వ్యవసాయ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. లో వొల్టేజ్ సమస్య ఉన్న దగ్గర కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామ ప్రజలు, దసురు నాయక్ , గుగులోత్. సునీత ఎంపీటీసీ , సూరయ్య,రవీందర్, యా కంబ్రం, ఏఈ రాజు,లైన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, లైన్ మన్ ఐలేశ్వర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Translate »