ఉద్యోగ విరమణ చేస్తున్న హెచ్ఎం కు ఎమ్మెల్యే ఘన సన్మానం.

ఉద్యోగ విరమణ చేస్తున్న హెచ్ఎం కు ఎమ్మెల్యే ఘన సన్మానం.
ఫోటో. బీటి నగర్ హెచ్ఎం అజీమ్ ను శాలువతో సన్మానిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్న.
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ పట్టణంలోని బీటి నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసే ఈ నెలలో పదవి విరమణ పొందుతున్న హెచ్ఎం అజీముద్దీన్ ను బుధవారం బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శాలువా పూలమాలరతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ హెచ్ ఎం అజీముద్దీన్ ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఎందరో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రభుత్వ విద్య వ్యవస్థలో ఆయన అందించిన సేవలను మర్చిపోలేనివని అన్నారు. కార్యక్రమంలో రాకాసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెసి ప్రధానోపాధ్యాయులు బాలచంద్ర తదితరులు ఉన్నారు.