తెలంగాణ ఉద్యమ అమరుని కుటుంబాన్ని ఆదుకోవాలి

జ్ఞాన తెలంగాణ, నారాయణ పేట టౌన్, జూన్ 12:

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ మృతి చెందిన క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన గౌస్ మియా కుటుంబాన్ని ఆదుకోవాలని సిపియం జిల్లా నాయకులు గోపాల్ కుటుంబసభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పర్ణికా రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం లో ప్రాణాలర్పించిన గౌస్ మియా కుటుంబాన్ని ఆదుకోవాలని గత ప్రభుత్వానిక్ మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదన్నారు . ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఉద్యమంలో మృతి చెందిన గౌస్ మియా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అమరుల కుటుంబాలకు చేసిన విదంగా ఈ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహయం ,ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే గారు తప్పక న్యాయం చేద్దామని హామీ ఇచ్చారని తెలిపారు.

You may also like...

Translate »