ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పలమకుల గ్రామానికి చెందిన కట్ట యాదమ్మ, 33 గృహిణి, తన ఇద్దరు పిల్లలతో సహా అదృష్యమైనది .
వివరాల్లోకెలితే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియజేసిన వివరాల ప్రకారం పలమకుల గ్రామానికి చెందిన కట్ట శ్రీనివాస్ తన భార్య తన తల్లి గారి ఇంటికి విట్యాల గ్రామం, ఫరూఖ్ నగర్ మండలం వెళ్తానని తనతో చెప్పగా శ్రీనివాస్ తన తల్లి గారి ఇంటికి వెళ్లవద్దు అని భార్యతో చెప్పి పనికి వెళ్లాడు.

అదే రోజున సుమారు 4 గంటల సమయంలో శ్రీనివాస్ పని నుండి తిరిగి ఇంటికి వచ్చి చూడగా అతని భార్య యాదమ్మ, అతని కుమార్తె సహస్ర వయస్సు: 08 సంవత్సరాలు, మరియు అతని కొడుకు పేరు శ్రీకర్, వయస్సు: 10 సంవత్సరాలు ఇంట్లో కనిపించలేదు అతని భార్య కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో . చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో తన భార్య, పిల్లల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారన్నారు.. తప్పిపోయిన మహిళ యాదమ్మ ఎత్తు: 4.5 అడుగులు, రంగు: ఫెయిర్ మరియు బ్లాక్ కలర్ చీర మరియు బ్లాక్ కలర్ బ్లౌజ్ దరించినధి.

అతని కుమార్తె ఎత్తు: 4.0″ అడుగులు, కలర్ చామనచ్చాయ కలదు మరియు పింక్ కలర్ ట్రాక్ అండ్ సూట్ దరించినాది. మరియు అతని కొడుకు ఎత్తు: 5.0 అడుగులు, నీలిరంగు టీ షర్టు దరించినాడు, అతని భార్య మరియు పిల్లలు తెలుగు భాషలో మాట్లాడుతారని తెలియ జేశారు.

You may also like...

Translate »