గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్

గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
గ్రూప్ – 1 ప్రీఎలిమినరీ పరీక్ష కేంద్రాలను ఆదివారం నాడు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అరుణోదయ డిగ్రీ కాలేజ్,ప్రభుత్వ కళాశాల వడ్డేపల్లి, పరీక్ష కేంద్రాలను సందర్శించి, అభ్యర్థులకు కల్పించిన వసతులపై అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లాలో గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు. ఈ పరీక్షకు22,665 అభ్యర్థులకు గాను,17,834 అంటే 78.69 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.