సాత ప్రవీణ్ కుమార్ విజయానంతరం మొక్కు తీర్చుకున్న 15వ వార్డు నాయకులు


జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:
శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డులో పోటీ చేసిన సాత ప్రవీణ్ కుమార్ విజయం సాధించాలని కోరుతూ వార్డు నాయకులు ఎన్నికల ముందు పలు ప్రముఖ దేవస్థానాలను దర్శించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రం కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమురవెల్లి మల్లన్న దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు పెట్టుకున్నారు.
ఎన్నికల ఫలితాల్లో సాత ప్రవీణ్ కుమార్ విజయం సాధించిన అనంతరం, తమ మొక్కులను తీర్చుకోవడానికి అదే దేవస్థానాలను మళ్లీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించి, వార్డు అభివృద్ధి మరియు ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో 15వ వార్డు నాయకులు సానికె శేఖర్, సానికె మహేష్, అయ్యవారి ప్రవీణ్, చెందిప్ప వెంకటేష్, లక్ష్మణ్ జోషి తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజల మద్దతుతో సాధించిన విజయాన్ని దైవకృపగా భావిస్తున్నామని నాయకులు తెలిపారు.
ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, ఎన్నికల సమయంలో చేసిన సంకల్పాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. మొక్కు తీర్చుకోవడం ద్వారా దైవ ఆశీస్సులు పొందామని, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతామని తెలిపారు.

You may also like...

Translate »